విశాఖ నగరంపై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తోంది. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ అవసరాలు.. ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కేసుకుని ముందుకెళ్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశాల వరకు ప్రతీదానికీ కేలిక్యూలేషన్స్ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బయటపడిన సందర్భాలు తక్కువే. 2024నాటికి జీవీఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలనూ కైవశం చేసుకోవాలని…