Japan PM: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచారు. దీంతో అక్టోబరు 1వ తేదీన ఇషిబా దేశ 102వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.