టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై మరోసారి సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. టీ20 వరల్డ్‌కప్ 2026 ఫలితమే గంభీర్ కొనసాగింపుకు కీలకంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారీ అంగీకరించాడు. గంభీర్ కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. ఐసీసీ టోర్నీల్లో ఫలితాలే ముఖ్యమని తివారీ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గంభీర్ పనితీరును గమనిస్తుందనే తివారీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గంభీర్‌కు…