భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు జరగనుందని, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. టూరిజం పాలసికి లోబడి కొన్ని ప్రాజెక్ట్‌లు వస్తాయని, వైజాగ్ త్వరలో అద్భుత నగరం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు. Also…
Bar Council of India Meets AP CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది.