కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఇకపై ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ లా కాలేజీ క్యాంపస్‌లో జూన్ 25న మొదటి సంవత్సరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
సౌత్ కోల్‌కతా లా కాలేజీ అత్యాచారం కేసులో కోల్‌కతా పోలీసులు శనివారం ఓ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది నాల్గవ అరెస్టు. గతంలో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..
కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన అందరినీ కలచివేసింది. ఈ కేసులో పట్టణ పోలీసులు నిందితులు మనోజిత్ మిశ్రా (31), జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖోపాధ్యాయ అలియాస్ ప్రమిత్ ముఖర్జీ (20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. వాస్తవానికి.. జూన్ 25న కళాశాల లోపల తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు…