తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు.
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ చార్జీ వరప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు దాడి చేయడాన్ని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేలేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ (శనివారం) పశ్యిమగోదావరి జిల్లా నరసాపురంలో డీజీపీ పర్యటించారు
పంజాబ్ లో అసలేం జరుగుతోంది. గతేడాది గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రయత్నం చేసింది. రైతుల ముసుగులో తీవ్రవాదులను ఉసిగొల్పిందనే వాదన వినిపిస్తోంది. పంజాబ్ అంతటా తీవ్రవాదం పెంచేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తాన్ ఉద్యమం తోడయితే పంజాబ్, దానివల్ల దేశం ప్రమాదంలో పడనుంది.
ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను బదిలీ చేయగా.. టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్ డీ రామకృష్ణ… టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు. క్రీడలు, సంక్షేమం ఐజీగా ఎల్ కేవీ రంగారావు… రైల్వే ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆక్టోపస్ డీఐజీగా ఎస్వీ రాజశేఖర్… లా అండ్ ఆర్డర్ డీఐజీగా అదనపు…
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు.. ఆయా ఘటనల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ఏపీ గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేటుపై వివరాలను చంద్రబాబు వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఆయా ఘటనల్లో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టం అన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడాం. బాధితురాలికి మెరుగైన వైద్యం…