తనను డీజీపీగా ఎంపికచేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు కే.రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తన పై ఇంత నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు. జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుంది. కింది స్థాయి సిబ్బందికి ఆ విధంగా దిశానిర్దేశం చేయాలి. ప్రజలకు పోలీసుల పై భారీ అంచనాలు ఉంటాయి. ప్రజల ధనప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు డీజీపీ.…
ఎన్నికలు జరుగుతున్న యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ ముఖ్యమంత్రి యోగిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి యోగి నిష్కళంకుడు. ఏ మాత్రం అవినీతి మచ్చలేని సమర్ధుడైన నాయకుడు. రాష్ట్ర హితం, దేశ హితం కోసం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రకాశ్ సింగ్. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లో అన్సారీ చీకటి సామ్రాజ్యాన్ని యోగి ప్రభుత్వం ధ్వంసం చేసింది. అలా ఎంతోమంది గూండా గిరి చేసిన వాళ్లందరినీ యోగి ప్రభుత్వం…
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలో క్రమేపీ కరోనా ఉగ్రరూపం దాల్చడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు1,400 మంది పోలీసులకు కరోనా రావడంతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసుల్లో పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులు కరోనా బారినపడ్డారు.…
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు.గౌరవరాష్ట్రపతి రాకను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధిపతులతో బిఆర్ కెఆర్ భవన్ లో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చర్చించారు. గౌరవ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపును మరింత ఇనుమడింప చేసే అవకాశంగా…
విజయవాడకు కొత్తబాస్ వచ్చారు. ఇప్పటివరకూ సీపీగా బాధ్యతలు చేపట్టి రిటైరయ్యారు శ్రీనివాసులు. సంతృప్తికరంగా నా పదవీ విరమణ చేస్తున్నా అన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాతో కలిసి పని చేసిన సిబ్బందికి తోటి ఆఫీసర్లకు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియాకు ధన్యవాదాలు అన్నారు శ్రీనివాసులు. మరో వైపు ఇన్ ఛార్జ్ సీపీ పాలరాజు మాట్లాడారు. బత్తిన శ్రీనివాసులు పోలీసు శాఖకు ఎనలేని సేవ చేశారు.…