‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని తెచ్చిపెట్టిన.. స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటించింది కానీ లావణ్య మాత్రం నిరాశ తప్పలేదు. ఇక ఇటీవల…
నాచురల్ స్టార్ నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల అయ్యి నేటికి ఆరేళ్ళు అవుతోంది.. ఈ చిత్రంతో నాని ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మతిమరుపును ప్రధానాంశంగా కథను రాసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. నానిని నటన పరంగాను మరోమెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం. గోపీసుందర్ అందించిన పాటలు…
‘అందాల రాక్షసి’ లాంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించింది నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగానే వున్నా సరైన హిట్ లేక వెనకబడిపోతుంది. ఇదిలావుంటే, ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ ముచ్చటించిన ఆమె తనకు ఓ సమస్య ఉందంటూ చెప్పుకొచ్చింది. తనకు ‘ట్రిపోఫోబియా’ ఉందని తెలిపింది. కొన్ని వస్తువులు, ఆకారాలను చూసినప్పుడు తనకు తెలియకుండానే భయం కలుగుతుందని ఆమె చెప్పింది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం…
సందీప్ కిషన్ నటించిన హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’ ఈ యేడాది మార్చి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నిజానికి బాక్సాఫీస్ దగ్గర పెద్దంత ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత మే నెలలో సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే… సూపర్ రెస్పాన్స్ ను…
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. అయితే ‘బంగార్రాజు’లో మాత్రం మరో హీరోయిన్‌కి ఛాన్స్ లేదని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన కథకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. దీంతో లావణ్య పాత్రకి అవకాశం లేనట్టుగా…
యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రీమేక్ చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నానికి నిషేధింపబడ్డ ఓ నేషనల్…
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 23న ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీఎడిట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్ తెలిపారు. ఆయన అనుకున్న పాయింట్…