తమిళంలో శ్రీకాంత్ పేరుతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ మూవీలో హీరోగా నటించాడు. అవికాగోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అచ్యుత రామారావు, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ జూన్ 24న విడుదల కాబోతోంది. గతంలో దర్శకులుగా మారిన సినిమాటోగ్రాఫర్స్ తో పనిచేసిన అనుభవం గురించి శ్రీరామ్ చెబుతూ,…
దర్శకుడు నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో ఆకట్టుకుని ‘మహానటి’ క్రేజీ డైరక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి సువర్ణ అవకాశం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్, దీపిక ప్రధాన పాత్రల్లో సైంటిఫిక్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఔత్సాహిక ఎడిటర్స్ కి జాబ్ ఆఫర్ ప్రకటించాడు. గతేడాది నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ…
వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 17వ తేదీ ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించారు. ఐశ్వర్యలక్ష్మీ నాయికగా నటించిన ‘గాడ్సే’లో నాజర్, షాయాజీ షిండే, కిశోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీని తెరకెక్కించిన గోపీ గణేశ్ ఇప్పుడీ ‘గాడ్సే’ను డైరెక్ట్ చేశాడు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడితో పోరాడే యువకుడి…
హీరోగానే కాదు… అవకాశం ఇస్తే విలన్ గానూ నటించడానికి సై అంటాడు నవీన్ చంద్ర. ఇప్పటికే పలు చిత్రాలలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి నటుడిగా మంచి మార్కులు పొందాడు. ఏప్రిల్ 8న విడుదల కాబోతున్న ‘గని’ చిత్రంలో బాక్సర్ ఆది పాత్రను పోషిస్తున్నాడు నవీన్ చంద్ర. ఆది పాత్ర, దాని తీరుతెన్నుల గురించి నవీన్ చంద్ర బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ”బాక్సింగ్ అంటే మొదటి నుండి ఇష్టం. రైల్వేస్ లో పనిచేసే మా మావయ్య…