ఓ వ్యక్తికి రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు.. అదృష్టం అలా అతడికి కలిసి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన వ్యక్తి మెగా మిలియన్స్ లాటరీ టికెట్ తగలడంతో బిలియనీర్ అయ్యాడు. ఆ వ్యక్తి ఏకంగా 13 వేల కోట్ల రూపాయిలను గెలుచుకున్నాడు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి జడలు విప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు లక్షణాలతో బాధితులు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో నిత్యం 20-30 మంది డెంగీ లక్షణాలతో వెళ్తున్నారు.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేసినందుకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ముందస్తు లోక్‌సభ ఎన్నికలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిషేధించడం వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేసినందుకు గాను 8 యూట్యూబ్ ఛానళ్లను (23 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు) కేంద్ర ప్రభుత్వం నిషేదిస్తున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
బ్రెజిల్లో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా పక్కనే తండ్రి సీట్లో బీర్ తాగుతున్నట్లు కనిపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి