ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ కు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ లో క్యాప్చర్ చేసింది ఐటీ విభాగం.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌కు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024…
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో అర్హులైన 200 మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది.. మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక లక్ష మందితో పెట్టొచ్చు.. ప్రజలను చూడటానికి వచ్చా తప్ప.. ఆర్భాటాలు.. హంగుల కోసం కాదని సీఎం చంద్రబాబు అన్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐఎస్)పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మల్లన్న సాగర్ రిజర్వాయర్, ఇతర జలాశయాలు నిరూపిస్తున్నాయని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు . “కేఎల్‌ఐఎస్ విఫలమైతే నీటిపారుదల శాఖ 21 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్‌లోకి ఎలా పంపుతుంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. శుక్రవారం మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు ఎమ్మెల్సీలు పి వెంకట్రామిరెడ్డి, డాక్టర్ వి యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు…
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
బీసీ కులగణననతో పాటు.విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా విద్యార్థులతో కలిసి హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్.కృష్ణయ్య.పలువురు బీసీ సంఘాలతో కలిసి ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ఇంతవరకు కులగణన చేయడం లేదని.ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిసి ల రిజర్వేషన్లు 42 శాతం కు పెంచడం లేదని కృష్ణయ్య ఆరోపించారు.…
విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం యొక్క 9వ ఎడిషన్‌ను ప్రారంభించింది, ఇది భారతదేశం అంతటా వెనుకబడిన ప్రాంతాల నుండి బాలికలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , ఛత్తీస్‌గఢ్‌లోని ఆకాంక్షాత్మక జిల్లాలకు చెందిన వారికి ప్రాధాన్యతనిస్తూ, అర్హత కలిగిన 1,500 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఆర్థిక సహాయం అందిస్తుంది. “ఈ చొరవ ద్వారా, హైస్కూల్ , కాలేజీల మధ్య ఉన్న అగాధాన్ని దాటడంలో సహాయం చేయడం ద్వారా…
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్టోబరు 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ సూచించారు. రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల…
హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో ‘నర్సుల నిర్లక్ష్యం శిశువు మృతి’ పై ఓ దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. వార్త కథనం పై వైద్య విధాన పరిషత్ కమిషనర్ ను విచారణకు ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు తక్షణమే హుజూర్ నగర్ ఆస్పత్రి సూపరిoటేoడెంట్ గారితో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. టీవివిపి కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రిక లో వచ్చిన వార్త…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు బండి సంజయ్. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పిన విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థినిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో…