తెలంగాణ గుర్తింపు, ఆత్మగౌరవం కోసం పాటుపడిన తొలి తరం నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతుగా తన మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ ఆశయ సాధన పట్ల అంకితభావంతో ఉన్నారని కొనియాడారు. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి ఉన్నప్పటికీ, బాపూజీ తన జలదృశ్యం నివాసాన్ని తెలంగాణ ఉద్యమానికి వేదికగా ఎలా ఇచ్చారో…
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆస్పత్రుల్లో రోగుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు 1600 నుంచి 1800 మంది పేషేంట్స్ అనారోగ్యంతో వైద్యులని ఆశ్రయిస్తున్నారు. రెండ్రోజులకు మించి జ్వరం వస్తే డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా టెస్టులు చేయించుకోవాలని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ సలహా ఇస్తున్నారు. ప్రబలుతున్న విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. విషజ్వరాల కారణంగా ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా వచ్చే వారిలో ఎక్కువగా విష జ్వరంతో పాటు…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాలేల్మ గ్రామంలో విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన విధుల్లో భాగంగా గ్రామంలోని కరెంటు స్తంభాలకు విద్యుత్ బల్బులను అమర్చారు. అనంతరం కరెంటును అన్ చేసే క్రమంలో కరెంట్ (LC) తీసుకోకుండే విద్యుత్ లైన్ ను అన్ చేసే సందర్భంలో ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ అవుట్…
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు శనివారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించండం కోసం బైక్ అంబులెన్సు ఎంతో ఉపయోగ పడుతుందని ఆమె అన్నారు. కంటైనర్ స్కూల్ మా ప్రాంతంలో ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతంలో వైద్యులు రాక ఇబ్బంది పడుతున్నామన్నారు మంత్రి సీతక్క. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం పంపించామని,…
యువత డ్రగ్స్ కు బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వెళ్లాలని తమ ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ముందుకు వెళ్లాలని మేడ్చల్ డిసిపి యువతకు పిలుపు నిచ్చారు.. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ పోలీసు లో భాగంగా ఈ రోజు జీడిమెట్ల గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిధి గా మేడ్చల్ డి.సి.పి కోటిరెడ్డి హాజరయ్యారు.. ఈ పోటీలలో మెత్తం 8 ఎనిమిది టీం…
భార్య భర్తలుగా నటిస్తూ కారులో ప్రత్యేకంగా నిర్మించిన అరలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు రాజేంద్రనగర్ sot పోలీసులు సంయుక్తంగా వల పన్ని ముఠా ను అరెస్టు చేసారు.. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఈ ముఠా సభ్యులు 5 గురు సభ్యుల ముఠా ఒరిస్సా నుండి హైదారాబాద్ మీదుగా డిల్లీకి హోండా సిటీ కార్ లో తరలిస్తున్నట్లు గా గుర్తించారు.. పోలీసులు ఇద్దరిని అదుపు లో తీసుకొని వారి దగ్గర…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది.
ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్లెదారులకు అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సమకూరుస్తుందన్నారు.