కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ 47 మంది నివాసితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు అసోం ప్రభుత్వానికి ధిక్కార నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.
ప్రముఖులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్‌ను కేటుగాళ్లు మోసం చేశారు. వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్‌ను రూ. 7 కోట్ల మేర మోసగించిన అంతర్-రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం ఛేదించారు.
సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన విడుదల చేశారు. ఈ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. దీనిని హైడ్రా కు ముడిపెడుతూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం విచారకరమని, హైడ్రా ఇలాంటి తప్పుడు వార్తలు ఖండిస్తోందని ఆయన అన్నారు. హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను సామాజిక మాధ్యమాలు అనుసరించవద్దని విన్నవిస్తున్నామన్నారు. హైడ్రా కు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో…
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది, దీనివల్ల జలమయమైన రోడ్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరు, హైటెక్ సిటీ, పంజాగుట్ట, చేవెళ్ల, లక్డీకాపూల్, టోలీచౌకి, బంజారాహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేట, శేరిలింగంపల్లి, ఎర్రగడ్డ, ఫిలింనగర్, మాసాబ్ ట్యాంక్, మొయినాబాద్, ఎస్సార్ నగర్, చందానగర్, నాంపల్లి, కొండాపూర్, శంకర్ పల్లి, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. ఈ వర్షాల వల్ల నగరంలోని చాలా…
ప్రాచీన మానవుడు రాతి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన పాండవుల గుట్టను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం పాండవుల గుట్టను పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ ఖరేతో కలిసి సందర్శించిన కలెక్టర్.. పర్యాటకుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు, రోడ్లు, పార్కింగ్, రిసార్ట్‌లు తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాండవుల గుట్టతో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత యువతకు…
పచ్చని పల్లెల్లో , తండా లలో మద్యం చిచ్చు పెడుతుండటంతో.. తండా యువకులు మద్యం పై పోరు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండా బెల్టు షాపుల మూలంగా. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు 24 గంటల పాటు జరుగుతున్నాయి.ఒక్కటైన తండా వాసులు తండా లో గల్లీ తిరుగుతూ మద్యం విక్రయాలను నిషేధిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఆరు వందల జనాభా కలిగిన చిన్న తండాలోనే ఐదు బెల్ట్ షాపులు ఈ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఆస్తి పంపకాలు చేసుకుందామని పంచాయతీ పెట్టించి, పంచాయతీలో ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానై ఆగ్రహం పట్టలేని కొడుకులు కన్న తండ్రి పై, అతని రెండో భార్యపై కత్తులతో దాడి చేయగా ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన మల్లయ్యకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య బాలవ్వ కు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు, రెండో భార్య పద్మకు కూడా ఒక్క…
సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ 33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దని, కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తహశీల్దార్ల బదిలీలపై…
హైడ్రా వేరు, మూసీ కార్యక్రమం వేరని, హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ నది సంరక్షణ కోసం ఇప్పుడు మూసీ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి పొన్నం. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కూల్చలేదని,…