ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారం ప్రభుత్వ పక్షాన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. గురువారం సచివాలయంలో BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. BEML కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి…
నగరంలోని కేబీఆర్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైదరాబాద్ నిజాం ప్రైవేట్ పెట్రోల్ పంపు అందరి దృష్టిని ఆకర్షించింది. కేబీఆర్ ఉద్యానవ నంలో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడడంతో ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వచ్చే పాదచారులు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. ఇంకేముంది.. ఈ పెట్రోల్ పంపుకు సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. నిజాం – తన కార్లు, ట్రక్కులు ఇతర మోటారు ఇంధనం…
పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు రాష్ట్రంలో సింగపూర్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని స్పష్టం చేశారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక వాతావరణం ఉంటుందని, సర్వత్ర…
తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ సమక్షంలో నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు నేడు ఢిలీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసేవారు బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రధాని నేతృత్వంలో 10 ఏళ్లలో పేదలకు వ్యతిరేకంగా మోడీ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ళు,గ్యాస్,నీళ్లు,మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని, దేశ ఖ్యాతి ,వికసిత భారత్ లక్ష్యాన్ని,పేదరిక నిర్ములన కోసం మోడీ చేస్తున్న పని చూసి…
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు.
జనసేన - టీడీపీ ఒప్పందం అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభ అని.. తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
బీఆర్స్ తప్పులు ఒప్పుకోని కాళేశ్వరం విజిట్ మానుకోవాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. శ్వేతపత్రంలో కాళేశ్వరంలో జరిగిన తప్పులను వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా బిఅరెస్ నేతలు తప్పులు ఒప్పుకోని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు చెయ్యరు, నిపుణుల కమిటీ నివేదికే ఫైనల్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం విషయంలో…
తెలుగు సీనియర్ హీరో మాస్ మాహారాజ రవితేజ రీసెంట్ మూవీ ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా.. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.. రవితేజ ఎప్పటిలాగే రెచ్చిపోయి నటించాడు.. ఇక…