Today (09-01-23) Business Headlines: ‘పేటీఎం’కి సురిందర్ చావ్లా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురిందర్ చావ్లా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది. సురిందర్ చావ్లా గతంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా మూడేళ్లపాటు ఉంటారు.
Digital Payments: మన దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య 23 బిలియన్లకు పైగా నమోదు కాగా ఆ చెల్లింపుల విలువ 38 పాయింట్ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్, ప్రిపెయిడ్ కార్డులు మరియు మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిగిన ఈ మొత్తం లావాదేవీల్లో దాదాపు సగం వాటా ఒక్క యూపీఐ ట్రాన్సాక్షన్‌లదే కావటం విశేషం. ఈ లావాదేవీల సంఖ్య 19 పాయింట్ ఆరు ఐదు…
TCS Number One: ఐటీ సర్వీసుల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఇండియాలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ వ్యాల్యూ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి 45 పాయింట్ 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు కాంతర్ బ్రాన్జ్ ఇండియా ర్యాంకింగ్ సంస్థ ఒక జాబితాను రూపొందించింది. ఈ లిస్టులో టీసీఎస్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును మరియు ఇన్ఫోసిస్‌ను దాటి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. బ్రాండ్ వ్యాల్యూ 212 శాతం…
Prepaid Card for Kamineni: కామినేని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఆఫర్డ్ ప్లాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్డును ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మందుల పైన, మెడికల్ టెస్టుల పైన డిస్కౌంట్ ఇస్తారు. 10 వేల రూపాయలు మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు మెడికల్ లోన్ కూడా అందిస్తారు.
Telangana Voice: మన దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ గతంలో ఒకటికి రెండు సార్లు హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా వెనక్కి తగ్గింది.
Online Games: మన దేశంలో సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న సరికొత్త 5జీ ఆవిష్కరణలు ఆన్‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీని నూతన శిఖరాలకు చేర్చనున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 42 కోట్ల మంది యాక్టివ్ ఆన్‌లైన్ గేమర్లు, 50 కోట్ల మంది యంగ్ డిజిటల్ యూజర్లు ఉన్నారు.