Telangana Voice: గెలిచిన తెలంగాణ వాదన. వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Voice: మన దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ గతంలో ఒకటికి రెండు సార్లు హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా వెనక్కి తగ్గింది. దీంతో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఊరట కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. మాకు సింగరేణి ఉండగా ఇతర దేశాల నుంచి బొగ్గును కొనే ప్రసక్తే లేదని తెలంగాణ మొదటి నుంచీ వాదిస్తూనే ఉండటం గమనించాల్సి విషయం. కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవటంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వాదన గెలిచినట్లయింది.
స్పైస్‌జెట్ ‘ట్యాక్సీ’
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్.. దుబాయ్ సహా 28 ప్రధాన విమానాశ్రయాల్లో ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు ట్యాక్సీ సర్వీసులకు సంబంధించిన ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి పికప్ లొకేషన్, పికప్ టైమ్ తదితర వివరాలివ్వాలి. దీనివల్ల ప్రయాణికులు పనిగట్టుకొని క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్పైస్‌జెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తెలిపారు.
Reserve Bank: రిజర్వ్ బ్యాంక్‌కి ‘రుణ’పడి ఉంటారు. కొత్త గైడ్‌లైన్స్.. నిజంగా గుడ్ న్యూస్.
టాప్‌లో బీఓఎం
ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో లోన్లు మరియు డిపాజిట్ గ్రోత్ పర్సంటేజ్‌ల విషయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర() టాప్‌లో నిలిచింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అగ్రస్థానాన్ని ఆక్రమించటం విశేషం. జూన్ చివరి నాటికి ఈ బ్యాంకు గ్రాస్ అడ్వాన్స్‌లు 27 శాతానికి పైగా పెరిగి రూ.1,40,561 కోట్లకు చేరాయి.
10 వేలకే 5జీ ఫోన్
కేవలం రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తామని క్వాల్కం ఇండియా చీఫ్ రాజెన్ వగాడియా తెలిపారు. ఇండియన్ చిప్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ వివిధ సెల్‌ఫోన్ పరికరాల తయారీదారులు మరియు టెలికం కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాజెన్ వగాడియా ఓ మీడియా గ్రూప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మాకు మాత్రమే!
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో బహుశా తాము మాత్రమే డే-1 నుంచి లాభాల్లో ఉన్నామేమోనని క్యూమిన్ ప్రతినిధి జహంగీర్ ప్రెస్ అన్నారు. తాజ్ హోటల్స్‌ను నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ సంస్థ రెండేళ్ల కిందట ఈ క్యూమిన్ అనే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించింది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవటం వల్లే నష్టాలు లేకుండా కొనసాగుతున్నామని జహంగీర్ ప్రెస్ పేర్కొన్నారు.
బంగ్లాకి ‘మలబార్’
రిటైల్ జ్యూలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మన పక్క దేశమైన బంగ్లాదేశ్‌లో రూ.200 కోట్లతో ఆభరణాల తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. చేతితో డిజైన్ చేసిన ఆభరణాలకు ఆ దేశంలో గిరాకీ పెరుగుతుండటంతో మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు పెట్టుబడి పెడుతోంది. మరో వైపు.. పశ్చిమ బెంగాల్‌లోని హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యూలరీ మ్యానిఫ్యాక్చరింగ్ కెపాసిటీని కూడా రెట్టింపు చేస్తోంది.
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!