కరోనా మహమ్మారి మరోసారి చైనాను వణికిస్తోంది. ఎన్నడూ లేనంత తీవ్రంగా ఆ దేశం ఇప్పుడు కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అతి పెద్ద నగరం షాంఘై కరోనాతో విలవిల్లాడుతోంది. గత పది రోజులుగా అక్కడ నిత్యం 20 వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. మంగళవారం కొత్తగా 23,000 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 23 రోజులుగా షాంఘై నగరవాసులు లాక్‌డౌన్‌తో ఆంక్షలతో పోరాడుతున్నారు. నిబంధనల అమలు పేరుతో అధికారులు చేస్తున్న ఓవర్ యాక్షన్‌పై జనం మండిపడుతున్నారు. సోషల్…