దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ధనాధన్ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్.…