JC Kishore Kumar: మంచివాడే కానీ.. రీకాల్ చేసిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్. రెవెన్యూ విభాగానికి అధిపతి. జనవరి 2020 లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన తొలినాళ్లలో మంచి పని వాడన్న ముద్ర వేసుకున్నారు. లాక్‌డౌన్‌లో నిత్యావసరాల ధరలను… ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ మార్కెట్లను ఏర్పాటు చేశాడు. ఉన్నతాధికారులతో మంచి పేరు తెచ్చుకున్నారు. మార్కెట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వ్యాపారుల్లో దడ పుట్టించారు. అక్రమ నిల‌్వలు ఉంటే సహించేది లేదని హెచ్చరించడంతో ప్రజలు హర్షించారు. ఇవన్నీ ఆయనకు చిక్కుల తెచ్చిపెట్టాయి. కొందరు అధికారులు కిశోర్‌కుమార్‌ను టార్గెట్ చేస్తూ హేళన చేసేవారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
మంచి అధికారిగా గుర్తింపు ఉన్నప్పటికీ…అవినీతి ఆరోపణలు అదే స్థాయిలో వచ్చాయ్. దీంతో జేసీ కిశోర్‌కుమార్‌ను…ప్రభుత్వం రీకాల్ చేసింది. కొత్తవలస, భోగాపురం, పూసపాటి రేగ, డెంకాడ, విజయనగరం మండలాల్లో…22ఏ భూముల బదలాయింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇనాం, మాజీ సైనికులకు ఇచ్చిన భూములకు సంబంధించి బదలాయింపుల ఫైళ్లను నిబంధనల ప్రకారం గ్రామ స్థాయి వీఆర్‌వో నుంచి తహసీల్దార్ ద్వారా జేసీ పరిష్కరించాలి. వారి ప్రమేయం లేకుండా జేసీ నేరుగా ఆ ఫైళ్లపై సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. భోగాపురం విమానాశ్రయం భూముల వ్యవహారాల్లోనూ తప్పిదాలకు పాల్పడినట్లు తెలిసింది. వీటన్నింటిపై ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో… జేసీని రీకాల్ చేసినట్లు సమాచారం.
తనకున్న అధికారంతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇనాం అబాలిషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను జిరాయతీగా మార్చే అధికారం జేసీకి ఉంది. దీన్నే ఆయుధంగా మార్చుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను మార్చేశారన్న ఆరోపణలున్నాయ్. ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో..భోగాపురం ఎయిర్‌పోర్టు భూములకు సంబంధించి…22 ఫైళ్లను క్లియర్ చేసి…కోట్లు కూడబెట్టారన్న విమర్శలు ఉన్నాయ్. దీనికి తోడు అధికారుల మధ్య విభేదాలే…జేసీ కిశోర్ కుమార్ రీకాల్ కారణమని కొందరు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరి సహకారం లేకుండా రెవెన్యూలో ఏ పని జరగదన్నది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు జాయింట్ కలెక్టర్‌ను రీకాల్ చేసిన ప్రభుత్వం…ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..