Lal Singh Chadda: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రంతో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో లాల్ సింగ్ చడ్డా అనే పేరుతో రిలీజ్ కానుంది.