యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం…
నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి.…
యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వరుడు కావలెను’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి ఎట్టకేలకు అక్టోబర్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో లాస్ట్ మినిట్ లో మంచి హైప్ వచ్చింది. ఇక…
హీరో నాగశౌర్య ఇంతవరకూ ఇద్దరు మహిళా దర్శకుల చిత్రాలకు పనిచేశారు. అందులో నందినీ రెడ్డితో రెండు సినిమాలు చేశారు. ఒకటి ‘కళ్యాణ వైభోగమే’, మరొకటి ‘ఓ బేబీ’. అలానే రెండో దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో ‘వరుడు కావలెను’ చిత్రానికి వర్క్ చేశారు నాగ శౌర్య. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు మహిళా దర్శకురాళ్ళు అవివాహితులే! నందినీ రెడ్డికి వివాహం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా కనిపించదు. ఆవిడ సంగతి పక్కన పెడితే… ఇప్పుడు తన మరో దర్శకురాలు లక్ష్మీ…