హీరో నాగశౌర్య ఇంతవరకూ ఇద్దరు మహిళా దర్శకుల చిత్రాలకు పనిచేశారు. అందులో నందినీ రెడ్డితో రెండు సినిమాలు చేశారు. ఒకటి ‘కళ్యాణ వైభోగమే’, మరొకటి ‘ఓ బేబీ’. అలానే రెండో దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో ‘వరుడు కావలెను’ చిత్రానికి వర్క్ చేశారు నాగ శౌర్య. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు మహిళా దర్శకురాళ్ళు అవివాహితులే! నందినీ రెడ్డికి వివాహం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా కనిపించదు. ఆవిడ సంగతి పక్కన పెడితే… ఇప్పుడు తన మరో దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు వరుడిని వెతికే పనిలో ఉన్నట్టు నాగశౌర్య చెబుతున్నాడు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వరుడు కావలెను’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగానూ చెప్పారు.
తాజాగా నాగశౌర్య దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ, ‘సినిమా షూటింగ్ ముగిసిన సందర్భంగా దిగిన ఫోటో ఇది. ఇప్పుడు ఈ వరుడు… తన సోదరి లక్ష్మీ సౌజన్యకు వరుడిని చూసే పనిలో ఉన్నాడు’ అని కామెంట్ పెట్టాడు. సహజంగా కొంతమంది ఔత్సాహిక కళాకారులు, సాంకేతిక నిపుణులు జీవితంలో ఏదో ఒకటి సాధించే వరకూ వివాహబంధంలోకి అడుగుపెట్టకూడదని అనుకుంటారు. బహుశా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య కూడా అలాంటి ఆలోచన చేస్తోందేమో తెలియదు. ఏదేమైనా… ఆమె డెబ్యూ మూవీ ‘వరుడు కావలెను’ విజయవంతం అయ్యి, ఆ విజయోత్సవంతో పాటే ఆమె వైవాహిక జీవితంలోకీ అడుగుపెట్టాలని కోరుకుందాం!
It’s a wrap☺️
— Naga Shaurya (@IamNagashaurya) August 8, 2021
Now this Varudu is looking for a Varudu for my @LakshmiSowG sister ♥️#VaruduKaavalenu pic.twitter.com/NjyL0HIUsa