భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు కొంత సమయం విరామం ప్రకటించింది. ఈ సమయంలో ఆయా ఈవెంట్స్‌ల్లో పాల్గొంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్‌లో పాల్గొని ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోసింది.
మను భాకర్ పరిచయం అక్కర్లేని పేరు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారతీయులకు మను భాకర్ సుపరిచితురాలే. స్టార్ షూటర్‌గా ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించింది. దీంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మను భాకర్ షూటర్‌గానే కాకుండా ఫ్యాషన్ షోలో కూడా తన వయ్యారాలతో అలరించింది. క్యూట్ వాక్‌తో చూపరులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.