లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారం నిరాకరించింది.