ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా…