Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా 2020లో సంచలనంగా మారిన ఫ్రెంచ్ మహిళ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడింది. లాహోర్-సియాల్కోట్ మోటర్‌వేపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితుల్ని లాహోర్ హైకోర్టు దోషులుగా నిర్ధారించింది, మరణశిక్ష విధించింది. ఈ తీర్పును బుధవారం బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో ప్రశంసించారు.
పాక్‌లో వివాదంగా గ్యాంగ్ రేప్ కేసు:
2020లో జరిగిన ఈ కేసు ఆ సమయంలో పాకిస్తాన్లో తీవ్ర సంచలనంగా మారింది. పాకిస్తానీ మూలాలు ఉన్న 32 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్-సియాల్కోట్ మోటర్‌వేపై వెళ్తున్న సమయంలో ఆమె కారులోని పెట్రోల్ అయిపోవడంతో ఆ కుటుంబం రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరు సాయుధులు వాహనంలోకి ఎక్కి, మహిళను దోచుకుని, సమీప పొలాల్లోకి లాక్కెళ్లి, ఆమె పిల్లల ముందే తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ రేప్ కేసు పాకిస్తాన్ రాజకీయాలను కుదిపేసింది. హక్కుల సంఘాలు, ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
Also Read
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
మరణశిక్షను సమర్థించిన హైకోర్టు:
దోషులుగా తేలిన అబిద్ అలీ అలియాస్ మల్హి మరియు షఫ్కత్ అలీ అలియాస్ బగ్గా దాఖలు చేసిన అప్పీళ్లను లాహోర్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. ట్రయల్ కోర్టు వేసిన మరణశిక్షను సమర్థించింది. జస్టిస్ సయ్యద్ షాబాజ్ అలీ రిజ్వీ, జస్టిస్ తారిఖ్ మెహమూద్ బజ్వాలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం కింది కోర్టు తీర్పును మార్చేందుకు అంగీకరించలేదు. మార్చి 2021లో లాహోర్ లోని ఉగ్రవాది నిరోధక కోర్టు ఇద్దరికి మరణశిక్ష విధించింది. మరణశిక్షతో పాటు కోర్టు పలు నేరాలకు గానూ యావజ్జీవం, ఇతర జైలు శిక్షల్ని విధించింది.
పాక్‌ను ప్రశంసించిన ఎలాన్ మస్క్:
స్పెస్ ఎక్స్ అధినేత, బిలయనీర్ ఎలాన్ మస్క్ పాక్ కోర్టు తీర్పును ప్రశంసించారు. ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ తీర్పును సానుకూల ముందడుగుగా అభివర్ణించారు. ‘‘శభాష్ పాకిస్తాన్. వెస్ట్రన్ దేశాల్లో మేము చేయాల్సింది ఇదే’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. పలు సందర్భాల్లో అత్యాచార ఘటనలపై ఎలాన్ మస్క్ స్పందించారు. బ్రిటన్‌లో బాలికను టార్గెట్ చేస్తున్న ‘‘పాకిస్తాన్ గ్రూమింగ్ ముఠా’’ అరాచకాలపై ప్రధాని కీర్ స్టార్మర్ను తీవ్రంగా విమర్శించారు.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!