కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్ సహాయంతో పంపు హౌస్‌లోకి దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా క్రేన్ వైరు తెగిపోయింది. ఆక్రైన్ దిగుతున్న కార్మికులపై పడటంతో.. దీంతో.. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక కార్మికునికి తీగ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి…