తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు బుధవారం కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు.
కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ధపడ్డారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను ఆదేశించారు.