Kuwait Fire: కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది.
కువైట్ లోని దక్షిణ నగరమైన మంగాఫ్ లోని 196 మంది వలస కార్మికులు నివసిస్తున్న 7 అంతస్తుల భవనంలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 45 మంది భారతీయులు మరణించారు. కాగా.. 45 మంది భారతీయుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించినట్లు కువైట్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత.. అగ్ని ప్రమాదంలో గాయపడిన భారతీయులకు సహాయం చేయడానికి, మృతదేహాలను భారతదేశానికి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి…