Borewell Incident: రోజుల వ్యవధిలో రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. ఇటీవల రాజస్థాన్‌లో చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. 10 రోజుల రెస్క్యూ తర్వాత విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. తాజాగా, గుజరాత్ కచ్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి ఇంద్రా మీనా ఘటన కూడా విషాదంగా మారింది. 33 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీల ప్రయత్నం వృథాగా మారింది.
Borewell Incident: రాజస్థాన్‌లో ఇటీవల బోరుబావిలో పడి మూడేళ్ల బాలిక చేతన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలిక సురక్షితంగా తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. 10 రోజుల రెస్క్యూ తర్వాత బాలిక చనిపోయింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మరవక ముందే మరో బోరుబావి సంఘటన చోటు చేసుకుంది.