సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని అంటుంటారు. అయితే అరుదుగా అలాంటి సినిమాలువస్తుంటాయి. మలయాళంలో ఇటీవల వచ్చిన ‘కురుతి’ సినిమా ఆ కోవకే చెందుతుంది. ‘కురుతి’ అంటే తెలుగులో రక్తం అనే అర్థం వస్తుంది. మనుషుల మధ్య క్షీణిస్తున్న సామరస్యాన్ని, సోదర భావాన్ని చూపించటమే కాకుండా దేవుని పేరిట జరిగే అర్ధ రహిత హింసను హైలైట్ చేస్తూ రూపొందించిన సినిమా ఇది. మను వారియర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మించటం…
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన “కురుతి” చిత్రం ఆగస్టు 11 నుండి డైరెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. మను వారియర్ దర్శకత్వం దర్శకత్వంలో అనీష్ పల్యాల్ రచించగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మించిన ఈ చిత్రం గురించి మాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మలయాళ థ్రిల్లర్‌లో రోషన్ మాథ్యూ, శ్రీందా, షైన్ టామ్ చాకో, మురళి గోపీ, మముక్కోయా, మణికంద రాజన్, నస్లెన్, సాగర్ నవాస్…