వైసీపీ ఎమ్మెల్యేలకు పని పాటా లేకుండా ప్రతిపక్షాల మీద పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టించాలో ఆలోచించడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా ఈ అభివృద్ధి పని చేశానని కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉందా…? వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకీడ్చిందన్నారు అఖిల ప్రియ. ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు వేయించుకుని చుక్కలు చూపిస్తుంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై…
కర్నూలు జిల్లాలోని అళ్లగడ్డ ఎగువ అహోబిలం ఆలయంలో చిరుత సంచరించింది. ఆలయంలోనే వెనుకవైపు ఉన్న ధ్వజస్థంబం నుంచి లోపలికి వచ్చిన చిరుత రామానుజాచార్యుల మండపం వద్ద ఉన్నకుక్కపిల్లలను లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. చిరుతను గమనించిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో బెదిరిపోయిన ఆ చిరుత అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎగువ అహోబిలం ఆలయంలోని రామానుజాచార్యుల మండపం వద్ద కుక్కపిల్లలు ఉన్నాయని ఎలా పసిగట్టిందని ఆశ్చర్యపోతున్నారు. అయితే, రెండు మూడు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కర్నూలోని మెడికల్ కాలేజీలో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మొత్తం 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఎంబీబీఎస్ ఫస్టీయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులకు, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా సోకింది. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కర్నూలులో పర్యటించనున్నారు.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్… ఆ తర్వాత కర్నూలు వెళ్లనున్నారు.. ఇక, ఉదయం 11.15 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పంచలింగాల గ్రామానికి చేరుకోనున్నారు.. పంచలింగాలలో జరగనున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో…
ఆ జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే. కాకపోతే.. ఒకరంటే ఇంకొకరికి పడదు. పైకి నవ్వుతారు.. తెరవెనక కత్తులు దూసుకుంటారు. ఎప్పుడు కలిసి పోతారో తెలియదు.. ఎందుకు విడిపోతారో కూడా గుర్తించలేం. ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ జరుగుతోంది. అదే పార్టీలో పెద్ద చర్చ…రచ్చ..! పార్టీని బలహీనపర్చడానికే నేతలు కష్టపడుతున్నారా? టీడీపీలో క్రమశిక్షణ కనుమరుగవుతోందా? ఒక్క సీటూ గెలవలేని జిల్లాలో ఎవరేం చేసినా అధిష్ఠానానికి…
కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. అయితే ఈ సభలో… అమరావతి రైతులకు మద్దతు తెలిపిన రాయలసీమ నేతల ఇళ్లకు గాజులు, చీరలు పంపుతాం అని జేఏసీ పేర్కొంది. రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం. అలాగే మూడు రాజధానుల బిల్లు తిరిగి ప్రవేశపెట్టకుంటే సీఎం జగన్ ఇల్లు కూడా ముట్టడిస్తాం అని జేఏసీ హెచ్చరించింది.…
మాయగాళ్ళు అడుగడుగునా పొంచి వున్నారు. ఆదమరిస్తే చాలు ఇంటిని, ఒంటిని కూడా గుల్ల చేసే జగజ్జంత్రీలు తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో ఓ దొంగ ఫక్కీరు బాగోతం బయటపడింది. కొత్తపల్లె మండలం దుద్యాలలో ఫకీరు వేషంలో మోసగించే యత్నం చేశాడో ప్రబుద్ధుడు. నెమలి ఈకల పట్టుకొని మీ ఇంటిని బాగు చేస్తామని మాయ మాటలు చెప్పారు నకలీ ఫక్కీర్లు. ఓ మహిళ బంగారు ఉంగరం కొట్టేసి ప్రయత్నం చేశారు. మత్తులో నుంచి స్పృహలోకి వచ్చిన మహిళ విషయాన్ని చుట్టుపక్కల…
పుల్లూరు టోల్ గేటు వద్ద మందుబాబులు వీరంగం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. బైక్ లను సీజ్ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే మందుబాబులు తీవ్ర అలజడి రేపారు. టోల్ గేటు వద్ద వాహనాలను అడ్డుకుని వాహనాలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. రోడ్డు పక్కన వైన్ షాప్ లు ఎందుకు పెట్టారని పోలీసులను ప్రశ్నించారు మందు బాబులు. వైన్ షాప్ దగ్గర ప్రాంతంలోనే డ్రంక్ అండ్…
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఎగువున భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ప్రాజెక్ట్‌కి నష్టం వాటిల్లేలా వుంది. తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేస్తే సుంకేసుల భద్రత ప్రశ్నార్థకం కానుంది. ఈ ప్రాజెక్టుని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్టు అంటారు. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనూ వందలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. సుంకేసుల ప్రాజెక్ట్‌కి సంబంధించి 16 గేట్లు పనిచేయడం లేదు. సుంకేసుల ప్రాజెక్టు నిర్వహణ…
కర్నూలు జిల్లా టీడీపీలో ఎవరి దుకాణం వాళ్లదేనా? ఎమ్మిగనూరు.. ఆలూరులో సొంత పార్టీలోనే రచ్చ మొదలైందా? ఇప్పటికే ఇంఛార్జులు ఉన్న నియోజకవర్గాల్లో పక్క నేతలు వచ్చి చేరడం ఆసక్తిగా మారింది. కోట్ల వర్గం ఓ మాజీకి ఝలక్ ఇస్తే ఇంకో మాజీ.. కోట్ల కుటుంబానికే షాక్ ఇచ్చేలా ఆఫీస్ తెరిచారట. ఎమ్మిగనూరులో కోట్ల మరో ఆఫీస్ తెరవడంతో కొత్త చర్చ..! కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీ వర్గపోరు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఎమ్మిగనూరులో కేంద్ర…