ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తన స్వంత జిల్లా, స్వంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలోని సి. బండ్లపల్లెలో అక్రమ మైనింగ్ ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. కుప్పంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఆఖండ సినిమాలో ఇలాంటి మైనింగ్ మాఫియాను చూశానన్నారు. సినిమాకు మించిన రీతిలో ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. మితిమీరుతున్న అక్రమ…