చిత్తూరు జిల్లా కుప్పం యూనివర్సిటీ లోని మహిళా హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం మహిళా హాస్టల్లో భోజనం తిన్న 30 మంది పీజీ మహిళా విద్యార్ధినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. దీనికి పూర్తి బాధ్యత వార్డెన్ అని అంటున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కొంతమంది పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.…