కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ కుంకీతో సరిహద్దు ప్రాంత రైతులకి భరోసా అని అన్నారు. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగుల్ని.. కుంకీలు దారి మళ్లించాయి.. తొలి ఆపరేషన్ విజయవంతం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలి వద్ద మామిడి తోటలను ధ్వంసం చేస్తున్న అటవీ ఏనుగుల గుంపుని కుంకీలు విజయవంతంగా దారి మళ్లించి…