కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలుపు కొరకు హుడా ట్రక్ పార్క్‌లో రేపు జరగబోయే విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి వెల్లడించారు.
కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు.