శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలలో పూర్తి కానుంది. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన భాగాల షూటింగ్ ముగిసినట్లు తెలుస్తోంది, అయితే ధనుష్‌కు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్‌లో సమాప్తం కానుంది. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.…