తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని…
బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం చిట్ చాట్.. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించినా.. అది ఎప్పటికీ జరుగి తీరుతుందని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రమంత్రి పదవి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు ప్రతిపక్ష నేత అవుతారని అన్నారు. విలీనం,…
రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందని, స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారని, రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారని, రేషన్ కార్డు కావాలని చెప్పలేదన్నారు కేటీఆర్. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారని, నలభై వేల కోట్లు…
KTR: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించండి అన్నారు.
డాక్టర్ల నిరసనకు గవర్నర్ సంఘీభావం.. ఆస్పత్రి దగ్గరకు వెళ్లి మద్దతు కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఆనవాళ్లు…
తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం…
తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప…
Independence Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై జాతీయ జెండా రెప రెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు....
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్ధి అనిరుధ్ కుటుంబ సభ్యులని కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అనిరుధ్ తల్లి బాధను మీరు విన్నారు, అలాంటి బాధ ఎవరు పడవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హాస్టల్లో అనిరుధ్ చదువుతున్నాడు,ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని, కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోతే ఎలా ఉంటుందని అందరికి తెలుసు…