Revanth Reddy: తెలంగాణలో బీజేపీని నడిపిస్తుంది బీఆర్ఎస్ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటునే అపహాస్యం చేసిన మోడీ.. తన మిత్రుడు కేసీఆర్ తో జరిగిన చర్చలు బయట పెట్టారని అన్నారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి మోడీ కేసీఆర్ బండారం బయటపెడితే ముఖ్యమంత్రి కుమారుడు అంత ఉల్లిక్కి పడుతున్నారు ఎందుకని డీకే అరుణ విమర్శించారు. బీజేపీ నేత విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. మోడీ చెప్పినట్లుగా NDA లో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు.. నిజమై తప్పక ఉండి ఉంటదని తెలిపారు.
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు.
ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని.. ఈసారి అదే గతి పడుతుందని అన్నారు. మోడీ ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బీజేపీకి వచ్చేది గుండు సున్నే అని ఎద్దేవా చేశారు.
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ 'X' వేదికగా విమర్శలు గుప్పించారు. పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్ అయితున్నడని తెలిపారు. నిజామాబాద్ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడని పేర్కొన్నారు.
Minister KTR: జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ రైతులకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ 4 వేల ఇండ్లతో నిర్మించామని తెలిపారు.
Dr Lakshman: ప్రధాని మోదీ వచ్చినప్పుడే సీఎంకు జబ్బు, జలుబు, జ్వరం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి Dr లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అన్నారు.
Dalit Bandhu Scheme: ఇవాళ (అక్టోబర్ 2) గాంధీ జయంతి రోజున దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది.
Minister KTR: మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ, క్యాతంపల్లి మున్సిపాలిటీల్లో రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.