చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని తెలిపారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమని తెలిపారు.
పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ చిట్ చాట్‌లో తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
Minister KTR: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తీరక లేకుండా రాష్ట్రం మెుత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేవారు.
Bandi Sanjay: ఆదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.
జనగామ బీఆర్ఎస్ టికెట్‌పై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం తెలుస్తోంది. మినిస్టర్ క్లబ్ హౌస్ లో కాసేపట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. 119 నియోజక వర్గాలలో కనీవినీ ఎరుగని అభ్యర్థులను బరిలో దించుతాము అని ఆయన అన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదు అని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చాం.. బిల్లా-రంగాలు కాంగ్రెస్ ను తిట్టడమే పనిగా పెట్టుకుని ఉర్ల మీద పడ్డారు.. ప్రజల ఆశీర్వాదం ఎవరి వైపు ఉంటుందో.. తేలిపోనుంది.. పోలింగ్ అయిపోగానే పారిపోయేందుకు సిద్దం అవుతున్నారు.
Warangal Traffic: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హన్మకొండకు వెళ్లనున్నారు. హన్మకొండలో రూ.900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆయనను సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అని ఆయన వ్యాఖ్యనించారు.