కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారని దుయ్యబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇళ్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు.