కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఈ విశ్రాంతి సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్ చూడటానికి తనకు సలహా ఇవ్వమని కోరారు. దాంతో చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా అనేక సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలని సూచించారు. అభిమానులు, సెలబ్రిటీలే కాకుండా ఓటీటీ సంస్థలు కూడా శుభాకాంక్షలతో పాటు సినిమాలు, సిరీస్‌లు చూడాలని కోరాయి.