ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్ కి చెందిన సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, సోమనాథ్ భారతి వంటి హేమా హేమీలు బీజేపీ అభ్యర్థుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్ సంగతి సరే సరి. పోస్టల్ బ్యాలెట్ లోనే నోటాతో పోటీ పడుతూ ఓట్లు రాబట్టింది కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.…