కరోనా దెబ్బతో వచ్చిపడ్డ లాక్ డౌన్ థియేటర్లు బంద్ చేసింది. దాంతో బాలీవుడ్ క్రమంగా ఓటీటీకి అలవాటు పడుతోంది. అయితే, ఆన్ లైన్ వ్యవహారంలోనూ సినిమా వాళ్లకు సినిమా కష్టాలు తప్పటం లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు పైరసీ సమస్య ఉంటే… ఇప్పుడు లీకేజీ గండం ఎదురవుతోంది. లెటెస్ట్ గా కృతీ సనన్ ‘మిమి’ సినిమా లీకై షేకైపోయింది! నాలుగు రోజులు ముందుగానే హీరోయిన్ కి పురిటి నొప్పులు తప్పలేదు! ‘మిమి’ సినిమా మరాఠీలో విజయవంతం అయిన ‘మాలా…