Tollywood: సూపర్ స్టార్ కృష్ణకు ఘననివాళి ఇవ్వడానికి టాలీవుడ్ సిద్దమయ్యింది. చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నోసేవలు అందించిన కృష్ణ మృతికి టాలీవుడ్ ఘన నివాళి ఇవ్వడానికి సిద్దపడింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి(TFPC), తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC) ఆయన మీద గౌరవంతో నవంబర్ 16 న అనగా రేపు షూటింగ్స్ ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది.