ఆయన ఎమ్మెల్సీ అయ్యారా.. లేదా? టీఆర్‌ఎస్‌తోపాటు రాజకీయావర్గాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆ ఫైల్ ఆగిందా లేక ఆపారా అన్న చర్చ జోరందుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్! ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్దిరోజుల ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్…
హుజురాబాద్ అభివృద్ధి జరగాలంటే టీఆరెఎస్ లో చేరాల్సిందే అని తన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని.. అందరి కోరిక మేరకు తాను రేపు టీఆరెఎస్ లో చేరుతున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ సమక్షంలో రేపు 1 గంటకు టీఆర్‌ఎస్ లో చేరుతున్నానని.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు.. read also : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. దళిత బంధు హుజూరాబాద్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని… హుజురాబాద్ అభివృద్ధి…
హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా,…
కౌశిక్ రెడ్డి రాజీనామాపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని.. పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. read also :…
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గతంలో ఆ నియోవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీ… అధికార టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై.. పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ.. కౌశిక్‌రెడ్డిపై వేటు వేసింది పీసీసీ… టీఆర్ఎస్ తో కుమ్మక్కై కౌశిక్‌రెడ్డి.. కోవర్టుగా మారి.. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్టు ప్రకటించారు…
అనుకున్నదే జరిగింది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డి.. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతుండగా.. తాజాగా లీక్‌అయిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి.. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఆయనే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది.. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కౌశిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి.. సమాధానం కోసం 24 గంటల డెడ్‌లైన్ పెట్టింది.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్…
ఈటల చేస్తున్న ఆరోపణలపై హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్ డబ్బులు పంపిస్తే… రెండున్నర యేండ్ల నుండి ఎందుకు మాట్లాడలేదని.. ఇన్నాళ్లు నిద్ర పోయావా? అని ఫైర్ అయ్యారు. ఈటెల ప్రస్ట్రెషన్ లో ఉన్నాడని.. పైసలు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈటెల వల్ల..ఊరు కాలదు..పేరు లేవదు అని..అధికారంలో ఉన్నప్పుడే ఈటల మీద పోరాడా ? ఇప్పుడు పోరాడతా అని పేర్కొన్నారు. ఇవాళ అమర వీరుల స్థూపం వద్దకు వెళ్ళిన…
ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో.. అన్నీ పార్టీలు హుజూరాబాద్ లోనే పాగా వేశాయి. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది అందరిలోనూ మెదిలే ప్రశ్న. హుజూరాబాద్ ఈటలను ఢీ కొట్టాలంటే టీఆర్ఎస్ కు బలమైన నాయకుడు కావాలి. దీనికోసం టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లు..ఈ మేరకు కేటీఆర్ ను కలిసినట్లు…