ఈటల ఎపిసోడ్ నేపథ్యంలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో.. అన్నీ పార్టీలు హుజూరాబాద్ లోనే పాగా వేశాయి. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది అందరిలోనూ మెదిలే ప్రశ్న. హుజూరాబాద్ ఈటలను ఢీ కొట్టాలంటే టీఆర్ఎస్ కు బలమైన నాయకుడు కావాలి. దీనికోసం టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లు..ఈ మేరకు కేటీఆర్ ను కలిసినట్లు ఇవాళ ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. కేటీఆర్ ను కౌశిక్ రెడ్డి కలిసినట్లు ఓ ఫోటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు. అయితే దీనిపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను టీఆర్ఎస్ లో చేరుతున్నా అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపారు కౌశిక్ రెడ్డి.
టీఆర్ఎస్ లోకి చేరుతున్న అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని..మిత్రుడి ఇంట్లో నిన్న ఓ కార్యక్రమంలో కేటీఆర్ గారిని కలవడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కలిసిన సందర్భంలో ఎటువంటి రాజకీయ పరమైన అంశాలు రాలేదు ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు దీనిని గమనించగలరు అని పేర్కొన్నాడు కౌశిక్ రెడ్డి. కాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక, ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.
టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి..