ఫిబ్రవరి నెల తొలి శుక్రవారం (4వ తేదీ) థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. శుక్రవారం దగ్గరకు వస్తుంటే… వరుసగా సినిమాల విడుదల ప్రకటన జోరందుకుంటోంది. ఆదివారం నాటికి ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్న చిత్రాల సంఖ్య ఏకంగా ఏడుగా తేలింది! విశాల్ ‘సామాన్యుడు’ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో శుక్రవారం విడుదల చేస్తున్నాడు. అలానే శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ చిత్రమూ ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోంది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవి…
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అలా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, విడుదల కాకుండా ఆగిపోయిన శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా సైతం ఫిబ్రవరి 4న జనం…