కొత్త ఏడాది వచ్చింది.. కొత్త క్యాలెండర్ల ఆవిష్కరణ కొనసాగుతూనే ఉంది.. ఇక, జీవితానుభవాలను కవిత్వంగా మలిచి, ఆ కవిత్వాన్ని మంచిమాటలుగా మార్చి, కొటేషన్ల రూపంలో ప్రతి ఏటా క్యాలెండరుగా అందించే కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన 2022 క్యాలెండరును ఆవిష్కరించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రగతిభవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ “మహాకవి శ్రీశ్రీ అన్నట్లు “మానవ జీవితమే ఒక మహాభారతం – అది మంచి చెడుల…