Singer Sunitha: ఆనంద్ రవి,కిషోరీ దత్రక్ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరమీను.. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని తెలిసిందే లే అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.